మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్‌..`భీమ్లా నాయ‌క్‌` కొత్త రిలీజ్ డేట్‌ ఇదే?!

November 6, 2021 at 12:40 pm

రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` సంక్రాంతి బ‌రిలో దిగుతుండ‌డంతో.. మిగిలిన హీరోలు త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు.

Mahesh Babu lauds Vakeel Saab, says Pawan Kalyan is in his top form - Movies News

అయితే ఇప్పుడు మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్ కూడా న‌డ‌వ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

Rana's video from Bheemla Nayak: Coming Soon!

కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ స‌మయానికి విడుద‌ల‌కు సిద్ధం అవ్వ‌డంతో.. భీమ్లా నాయ‌క్‌ను ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

 

మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్‌..`భీమ్లా నాయ‌క్‌` కొత్త రిలీజ్ డేట్‌ ఇదే?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts