భీమ్లా నాయక్ సినిమా నుంచి త్వరలో గట్టి ట్రీట్..!

November 10, 2021 at 10:01 am

ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం భీమ్లా నాయక్.. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట్లో పక్కన పెడితే, ఆ తర్వాత సినిమాపై ఒక్కో అప్డేట్ వస్తూ మాస్ లో కి ఈ సినిమా హైప్ ఎక్కడం స్టార్ట్ అయింది. అంతేకాదు ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇక చెప్పాలంటే థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది అని చెప్పాలి..

Bheemla Nayak first look: Pawan Kalyan fights goons in Telugu remake of  Ayyappanum Koshiyum, watch video | Entertainment News,The Indian Express

ఎందుకంటే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లిరిక్స్ అందించగా, థమన్ మ్యూజిక్ సారధ్యంలో వచ్చిన లాలా భీమ్లా పాట యూ ట్యూబ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు విడుదలైన 24 గంటల లోపే పది మిలియన్ వ్యూస్ ని నమోదు చేసుకొని సౌత్ ఇండియన్ బెస్ట్ సాంగ్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ పాట. ఇకపోతే ఈ పాట పై డీజే వెర్షన్ ను కూడా సిద్దం చేస్తున్నాడట థమన్.. అంతేకాదు కొత్త ఏడాదికి కానుకగా డిసెంబర్ 31 వ తేదీన రిలీజ్ చేస్తున్నామని కన్ఫామ్ కూడా చేశారు.. ఇకపోతే 2022 కొత్త ఏడాది ఆరంభానికి వెల్కమ్ భీమ్లా డీజే ట్రీట్ తో దద్దరిల్లిపోతుంది అని చెప్పవచ్చు.

భీమ్లా నాయక్ సినిమా నుంచి త్వరలో గట్టి ట్రీట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts