బిగ్‌బాస్ 5లో ఆ కంటెస్టెంట్‌కి సోనూసూద్ మద్దతు..వీడియో వైర‌ల్‌!

November 10, 2021 at 9:30 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో మ‌రియు విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు.

Bigg Boss Telugu 5 premiere episode LIVE UPDATES: From Ravi Kiran, Swetaa to Lahari Shari, here's complete list of contestants | Entertainment News,The Indian Express

ప్ర‌స్తుతం ఈ ప‌ది మందిలో కొంద‌రు హౌస్‌లో ఎక్కువ రోజుల పాటు నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రికొంద‌రు టాప్‌-5కి వెళ్లి టైటిల్ కొట్టేయాల‌ని తీవ్రంగా కృషి చేస్తున్నారు. మ‌రోవైపు అభిమానుల‌తో పాటు సినీ సెల‌బ్రెటీలూ బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌కు స‌పోర్ట్ చేస్తుండ‌గా.. రియ‌ల్ హీరో సోనూసూద్ సైతం ఓ కంటెస్టెంట్‌కి మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఓ వీడియో వ‌దిలారు.

Sreerama Chandra (@Sreeram_singer) / Twitter

అందులో సోనూసోద్ మాట్లాడుతూ..`బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్‌ ఇవ్వు శ్రీరామ్‌. అతడికే నా ప్రేమాభినందనలు.. లవ్‌ యూ మ్యాన్‌` అని చెప్పుకొచ్చాడు. ఇక సోనూసూద్ స‌పోర్ట్ చేయ‌డంతో.. శ్రీ‌రామ్ గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. సోనూ ఫ్యాన్స్ సైతం శ్రీ‌రామ్‌కి అండ‌గా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఈ క్రేజ్ చివ‌రి వ‌ర‌కు కొన‌సాగితే.. శ్రీ‌రామ్ విన్న‌ర్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

బిగ్‌బాస్ 5లో ఆ కంటెస్టెంట్‌కి సోనూసూద్ మద్దతు..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts