సునీల్ కూతురుని కాపాడిన స్టార్ హీరో..!!

ప్రముఖ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా ఒక సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సునీల్ పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ , కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు.. కానీ ప్రస్తుతం తనలో విలనిజాన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.. ఇకపోతే సునీల్ కూతురిని ప్రముఖ స్టార్ హీరో రాజశేఖర్ కాపాడారు అని ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..

Telugu Hero Rajashekar single take - Tsnews.tv telugu

ప్రముఖ హీరోగా గుర్తింపు పొందిన రాజశేఖర్, వృత్తి పరంగా డాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సునీల్ కన్నీటిపర్యంతమయ్యారు.. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజశేఖర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అంతేకాదు తనకు చాలా సహాయం కూడా చేశారని తెలిపారు.. వృత్తిపరంగా డాక్టర్ కావడం చేత ఒకానొక సమయంలో తన కూతురు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, రాజశేఖర్ కాపాడారు అని తెలియజేశారు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో రాజశేఖర్ తన కూతురుకి వైద్యం అందించి ప్రాణాలను కాపాడారు అని, జీవితంలో ఆయనను ఎప్పటికీ మర్చిపోలేను అని ,జీవితాంతం రుణపడి ఉంటాము అని కూడా సునీల్ తెలిపారు.