భీమ్లా నాయక్ నుంచి కీలక అప్డేట్..!

November 30, 2021 at 10:55 am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న సినిమా భీమ్లా నాయక్. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతోపాటు లాలా భీమ్లా, అంత ఇష్టమా అనే పాటలకు కూడా అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్ నుంచి నాలుగో పాట విడుదలపై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీలోని అడవితల్లి మాట.. అంటూ సాగే పాటను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.

ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి విడుదలైన అన్ని పాటలు చార్ట్ బస్టర్ లో టాప్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు విడుదలకు కానున్న నాలుగో పాట పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి.

భీమ్లా నాయక్ నుంచి కీలక అప్డేట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts