బాల‌య్య దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుంటున్న మెగా హీరో..!?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

Akhanda blast: Balakrishna explodes as Aghora

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని నిన్న మేక‌ర్స్ ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేశారు. అయితే అఖండ రిలీజ్ డేట్ ఇప్పుడో మెగా హీరోను తీవ్రంగా క‌ల‌వ‌ర పెడుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఈయ‌న కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన `గ‌ని` చిత్రం డిసెంబర్‌ 3న విడుదల కానుంద‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు.

Varun Tej Ghani update today evening

డిసెంబర్ 3 శుక్రవారం కావడంతో సోలోగా రావాలని వ‌రుణ్ తేజ్ ముందు నుంచి ప్రిపేర్ అవ్వ‌గా.. అఖండ విడుద‌ల తేదీని డిసెంబ‌ర్ 2గా ప్ర‌క‌టించి బాల‌య్య ఊహించ‌ని దెబ్బ కొట్టాడు. అఖండ‌పై ఉన్న అంచనాలు చూస్తుంటే గ‌ని సినిమాకు గట్టి పోటీ తప్పదు. ఈ నేప‌థ్యంలోనే ఏం చేయాలో అర్థంగాక వ‌రుణ్ త‌ల ప‌ట్టుకుంటున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.