ద్రాక్షాయనిగా అడుగుపెడుతున్న రంగమ్మత్త

November 9, 2021 at 10:53 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాుడ. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో స్టార్ యాంకర్ కమ్ నటి అందాల భామ అనసూయ భరద్వాజ్ నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన అనసూయ, ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి ఆమెతో ద్రాక్షాయని అనే పాత్రను చేయిస్తున్నాడు సుకుమార్. మరి ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తుండగా, ఆయన సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర చివర్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో అనసూయ ఎలాంటి పాత్రను పోషిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ద్రాక్షాయనిగా అడుగుపెడుతున్న రంగమ్మత్త
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts