అల్లు అర్జున్ పై కేసు నమోదు..కారణం ఇదే..!

November 10, 2021 at 6:51 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ ర్యాపిడో సంస్థ కోసం ఇటీవలే ఒక ప్రకటనలో నటించాడు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులో మామూలు దోసెలా ఎక్కి నల్లని. కురూమా వేసి, కైమా కొట్టి, మసాలా దోసె వేసి దింపుతారని, ఎందుకు వచ్చిన పేరంటం అండి, ర్యాపిడో బుక్ చేసుకోండి దోసె తీసినంత సులువుగా ట్రాఫిక్ లో చెమట పట్టకుండా వెళ్ళిపొండి అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేశాడు. ఈ విషయంపై ఆర్టీసీ ప్రయాణికులు, ఆ సంస్థ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో అల్లు అర్జున్ చేసిన ఈ  ర్యాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందని అల్లు అర్జున్ తో పాటు ఆ సంస్థకు కూడా ఆర్టీసీ సంస్థ నోటీసులు పంపించారు ఎండి సజ్జనార్‌. అంతేకాకుండా మా ఆర్టీసీ సంస్థను ఎవరైనా కించపరిస్తే సహించేది లేదని, కేవలం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలో నటులు నటించాల్సిందిగా ఎండి సజ్జనార్‌ కోరారు.

అల్లు అర్జున్ పై కేసు నమోదు..కారణం ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts