ఆ బ‌డా నిర్మాత‌కు హ్యాండిచ్చిన బ‌న్నీ..ఫ్యాన్స్ అస‌హ‌నం?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ `ఐకాన్‌` సినిమా చేయ‌బోతున్న‌ట్లు కొన్నేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కథ సిద్ధంగా ఉంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు బ‌డా నిర్మాత దిల్ రాజ్ రెడీగా ఉన్నారు. కానీ, బ‌న్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డంతో.. ఈ సినిమా ఆల‌స్యం అవుతూనే ఉంది.

Has the Allu Arjun starrer 'Icon' been shelved? Here's an update | Deccan Herald

ఇక ఈ మ‌ధ్య దిల్ రాజ్ `ఐకాన్‌`ను ఖ‌చ్చితంగా తెర‌కెక్కిస్తామ‌ని.. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో బ‌న్నీని దిల్ రాజ్‌ లైన్‌లో పెట్టాడ‌ని అంద‌రూ భావించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయి.. ఎప్పుడెప్పుడు ఐకాన్ తెర‌కెక్కుతుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Dil Raju Did Not Mean to Insult Bunny But It Happened?

అయితే బ‌న్నీ దిల్ రాజ్‌కి హ్యాండిచ్చాడట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఐకాన్ చేసేందుకు బ‌న్నీ నిరాక‌రించాడ‌ని, ఆయ‌న మ‌రో ప్రాజెక్ట్‌పై ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో ప‌క్క‌న పెడితే.. ఈ విష‌యంపై బ‌న్నీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Share post:

Latest