డైలమాలో రీతువర్మ సినీ కెరీర్‌..ఆ హీరో అయినా కాపాడ‌తాడా?

రీతువ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైపోతోంది. ఇటీవల ఈమె న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్‌, వ‌రుడు కావలెను చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

Happy Birthday Ritu Varma | Top Five Performances Of The Actress | Ritu Varma Instagram

దీంతో ఈ అమ్మ‌డి సినీ కెరీర్ డైల‌మాలో ప‌డిన‌ట్టు అయింది. ఇక ఇప్పుడు రీతువ‌ర్మ యంగ్ హీరో శర్వానంద్ స‌ర‌స‌న `ఒకే ఒక జీవితం` మూవీలో న‌టిస్తోంది. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Oke Oka Jeevitham - Motion Poster | Sharwanand, Ritu Varma, Amala Akkineni | Shree Karthick - YouTube

అయితే రీతువ‌ర్మ త‌న ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంద‌ట‌. ఈ సినిమా గ‌నుక హిట్టైతే.. రీతువ‌ర్మ కెరీర్ మ‌ళ్లీ పుంజుకుంటుంది. లేదంటే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమె వైపే చూడ‌రు. మ‌రి శ‌ర్వానంద్ అయినా ఈ చిన్న దాన్ని కాపాడ‌తాడో..లేదో..చూడాలి.