ఆలోచింపజేస్తున్న `3 రోజెస్` ట్రైలర్..!!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు ప్ర‌జెంట్ చేస్తున్న‌ స‌రికొత్త వెబ్ సిరీస్ `3 రోజెస్‌`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు.

3 Roses (2021) Aha Video: Cast, Crew, Release Date, Roles, Real Names

న‌వంబ‌ర్ 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండ‌గా.. ఆహా వారు తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. రీతూ – జాన్వీ – ఇందు అనే ముగ్గురు స్వతంత్ర భావాలు కలిగిన ఈ జనరేషన్ అమ్మాయిల జీవితాల ఆధారంగా లవ్, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలబోసి ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫ్రీడమ్ కోరుకుంటూ వేరే వ్యక్తి నీడలో ఎందుకు బ్రతకాలి? అనుకునే ఈ ముగ్గురి పెళ్లి చుట్టూ జరిగిన సంఘటనలను ఈ సిరీస్‌లో ప్రస్తావించార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

3 Roses Title Track Lyrical Video Out Now | Payal, Eesha, Purnaa - Film Crazy Media

`ఆడపిల్లలను ఎందుకు ఖాళీగా ఉంచడం అని చదివించడం.. కెరీర్ లో ఎదిగే టైమ్ కి పెళ్లి చేసేసి వేరే వాడి నీడలో బ్రతికేయమనడం కరెక్ట్ కాదు` అనే డైలాగ్ ఆలోచింప‌జేస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువ‌ల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న తాజా ట్రైల‌ర్‌ సిరీస్‌పై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఫుల్ సిరీస్ ఏ మేర‌కు మెప్పిస్తుందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

 

Share post:

Latest