మ‌ళ్లీ ఒకే స్క్రీన్‌పై బాల‌య్య‌-రోజా.. ఇక ద‌బిడి దిబిడే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా న‌టించి ఆన్ స్క్రీన్‌పై సూప‌ర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు.

Balakrishna - Roja : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ షో'కు గెస్ట్‌గా జబర్ధస్త్  రోజా.. ఆహా అంటున్న అభిమానులు..

బాల‌య్య‌, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై మ‌ళ్లీ చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా త‌రుణం రానే వ‌చ్చింది. అవును, చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

బాలయ్యకు ఫోన్ చేసిన రోజా.. మళ్ళీ వీళ్లిద్దరి రొమాన్స్ | Roja phone call to  Balakrishna.. here is interesting conversation

బాల‌య్య ప్ర‌స్తుతం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో `అన్ స్టాప‌బుల్‌` అనే టాక్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వ‌గా.. ఫ‌స్ట్ మోహ‌న్ బాబు ఫ్యామిలీ, సెకెండ్ న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌చ్చి సంద‌డి చేశారు. అయితే త్వ‌ర‌లోనే బాల‌య్య హోస్ట్ గా చేస్తున్న ఈ టాక్‌లో రోజా కూడా పాల్గొన‌బోతోంద‌ట‌.

Unstoppable with NBK | Balakrishna | An aha Original | Premieres November 4  - YouTube

ఈ మధ్య రోజా పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ స్వయంగా ఆమెకు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసారట. అలాగే ఈ సంద‌ర్భంగా అన్ స్టాప‌బుల్‌లో గెస్ట్‌గా రావాల‌ని కూడా బాల‌య్య కోరార‌ట‌. దీంతో ఆమె వెంట‌నే ఓకే చెప్పింద‌ని.. కొద్ది రోజుల్లోనే రోజా-బాల‌య్య ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ సైతం జ‌ర‌గ‌బోతోంద‌ని టాక్‌. మ‌రి ఇదే నిజ‌మైతే ద‌డిబి దిబిడే అంటున్నారు ఫ్యాన్స్‌.