జగన్ కు షాక్ కాని షాక్..

ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన 12 మంది సమావేశమయ్యారు. అందరూ మాట్లాడుకున్నారు.. చివరకు ఒక్క మాటపై నిలబడ్డారు.. తామంతా పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. సంతకాలు కూడా చేశారు.

దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీలో షాక్.. అరె.. ఇంతమంది ఒక్కసారిగా రాజీనామా చేశారేంటనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. జిల్లా నాయకులు మొత్తం అధిష్టానానికి ఈ విషయం చేరవేశారు. ఎక్కడో.. ఏదో తప్పు జరిగిందని హైకమాండ్ రంగంలోకి దిగింది. అందరితో మాట్లాడింది. సర్దిచెప్పింది..ఇంత ఆవేశపడితే ఎలా అని నాయకులు వీరిని కూల్ చేశారు. దీంతో సర్పంచులు బెట్టు వీడారు. రాజీనామా లేదు.. ఏమీ లేదు.. మేమెందుకు రాజీనామా చేస్తాం.. అందరం కలిసి మాట్లాడుకున్నాం అని తరువాత మీడియాకు చెప్పుకొచ్చారు. ఇదీ అసలు విషయం. అయితే అధికార పార్టీలో ఏదో జరుగుతోంది.. బయటకు మాత్రం రావడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. తమకు పరిచయం ఉన్న నాయకులతో కూపీ లాగుతున్నారు. ఎలాగైనా వారి అసంత్రుప్తిని బయటకు లాగా వైసీపీని దెబ్బకొట్టాలని ప్లాన్ వేస్తున్నారు. వారి పాచికలు మాత్రం పారడం లేదు. వైసీపీ..టీడీపీకీ ఆ చాన్స్ ఇవ్వడం లేదు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలను సముదాయిస్తోంది.