బాల‌య్య భామకు అన్యాయం.. అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

November 24, 2021 at 1:20 pm

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా చేసింది. కానీ, స‌రైన హిట్టే కొట్ట‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాల‌య్యకు జోడీగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `అఖండ‌` సినిమాలో న‌టించింది.

Akhanda: బాలయ్య `అఖండ` రోర్‌ షురూ.. గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌  డిటెయిల్స్ | balakrishna starrer akhanda movie pre release event details

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో ప్ర‌గ్యాకు ఊహించ‌ని అన్యాయం జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హిందీలో `యాంటిమ్` అన్న టైటిల్ తో ఓ భారీ మాఫియా యాక్షన్ డ్రామా చిత్రం తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ , ఆయ‌న బావ ఆయుష్ శర్మ న‌టిస్తున్న ఈ మూవీకి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

Pragya Jaiswal: All you need to know about Salman Khan's 'Antim' co-star |  The Times of India

అయితే ఈ చిత్రంలో సల్మాన్ కి రొమాంటిక్ ట్రాక్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసిన మేక‌ర్స్‌.. స‌ల్మాన్‌- ప్ర‌గ్యాల‌పై కొన్ని సన్నివేశాలు ఒక పాట కూడా చిత్రీకరించారు. కానీ, చివ‌ర‌కు ఫుటేజ్ లెంగ్త్ దృష్ట్యా ఎడిటింగ్ లో ప్ర‌గ్యా న‌టించిన‌ పార్ట్ మొత్తం తొలగించారు.

Salman Khan completes shoot for Antim; film to release in theatres

దీంతో ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ప్రగ్య తీవ్ర నిరాశకు గురైందట. ఈ సినిమా విడుద‌లై ఉండుంటే.. బాలీవుడ్‌లో మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌చ్చేవ‌ని ప్ర‌గ్యా ఆశించింది. కానీ, ఇప్పుడు ఆమె న‌టించిన స‌న్నివేశాల‌న్నిటినీ సినిమాలోంచి తొల‌గించ‌డంతో.. ప్ర‌గ్యా ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టైంది.

 

బాల‌య్య భామకు అన్యాయం.. అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts