సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!

నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు.
కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కామన్ గా బోయపాటి శ్రీను సినిమాలకు యూ/ఏ సర్టిఫికెట్ వస్తుంటుంది. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన అఖండ సినిమాకు కూడా అదే సర్టిఫికెట్ వచ్చింది. లెజెండ్ సినిమాతో హీరో జగపతిబాబును విలన్ గా పరిచయం చేసిన బోయపాటి శ్రీను, అఖండ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ ను విలన్ గా తీసుకున్నాడు. శ్రీకాంత్ తన కెరీర్ మొదట్లో విలన్ గా నటించిన ప్పటికీ తొలిసారిగా ఒక అగ్ర హీరో సినిమాల్లో బలమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంత భారీ విజయాలను అందుకున్నాయో తెలిసిందే. వరుస ప్లాప్స్ లో ఉన్న బాలయ్యకు ఈ రెండు సినిమాలు ఊరటనిచ్చాయి. మరోసారి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అఖండ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.