మ‌హేష్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌గ‌డ.. అస‌లు మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ర‌గ‌డ‌కు సిద్ధం అవుతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి స‌రేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీని మొద‌ట 2022 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బ‌రిలోకి దిగ‌డంతో.. మేక‌ర్స్ `స‌ర్కారు వారి పాట‌`ను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీకి షిప్ట్ చేశారు. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

అయితే ఇప్పుడు ఆ తేదీన విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా `లైగ‌ర్‌`తో వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడ‌ట‌. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని ఛార్మి, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

షూటింగ్ శ‌ర వేగంగా పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కూడా ఏప్రిల్ 1న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. మ‌రి నిజంగానే లైగ‌ర్ ఏప్రిల్ 1న విడుద‌లైతే.. మ‌హేష్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల మ‌ధ్య బాక్సాఫీస్ ర‌గ‌డ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు.

Share post:

Latest