ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రాజ‌మౌళి భేటీ..కార‌ణం అదేనా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త్వ‌ర‌లోనే క‌లుసుకోబోతున్నార‌ట‌. దీంతో వీరిద్ద‌రి భేటీపై సార్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అస‌లెందుకు ప‌వ‌న్‌ను రాజ‌మౌళి మీట్ అవుతున్నార‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతుండ‌గా.. ఓ కార‌ణం ప్ర‌ధానంగా వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

S S Rajamouli's 'RRR' gets a new release date; to hit theatres in January  2022! | Hindi Movie News - Times of India

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Bheemla Nayak Missing This Element! - Bheemla Nayak

ఈ చిత్రం విడుద‌లైన కొద్ది రోజుల‌కే అంటే జ‌న‌వ‌రి 12న సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానాలు క‌లిసి న‌టిస్తున్న మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌` విడుద‌ల కానుంది. ఇక జ‌న‌వ‌రి 14న ప్ర‌భాస్-పూజా హెగ్డేలు జంట‌గా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన `రాధేశ్యామ్` రిలీజ్ కానుంది. ఒకేసారి మూడు పెద్ద హీరోల చిత్రాలు విడుద‌లైతే బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా క్లాషెస్ ఏర్ప‌డ‌తాయి.

Pawan Kalyan films | SS Rajamouli on why he doesn't see any practical  possibility of teaming up with Pawan Kalyan

దాని ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై తీవ్రంగా ప‌డుతుంది. అందు వ‌ల్ల‌నే రాజ‌మౌళి త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌ను క‌లిసి `భీమ్లా నాయ‌క్‌` విడ‌ద‌ల తేదీని వాయిదా వేయమని రిక్వ‌స్ట్ చేయ‌నున్నార‌ట‌. మ‌రి రాజ‌మౌళి కోరితే ప‌వ‌న్ ఒప్పుకుంటాడా..? లేదా..? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Latest