నో పెళ్లి అంటున్న ర‌కుల్‌.. గుర్రుగా ప్రియుడు..?!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ర‌కుల్ త‌న ప్రియుడిని అంద‌రికీ ప‌రిచయం చేసిన సంగ‌తి తెలిసిందే.

Rakul Preet Singh appears before ED in 2017 drug case | Cities News,The  Indian Express

కొంతకాలంగా బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్‌.. త‌న బ‌ర్త్‌డే నాడు వారి రిలేష‌న్‌పై ఓపెన్ అయింది. దీంతో అతడితోనే రకుల్‌ త్వరలోనే ఏడడుగులు వేయబోతుందని అందరూ అభిప్రాయప‌డ్డారు. కానీ, ర‌కుల్ మాత్రం నో పెళ్లి అంటోంది. తాజాగా `థ్యాంక్స్ గాడ్` చిత్ర ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న ర‌కుల్.. త‌న పెళ్లికి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది.

Rakul Preet Singh And Jackky Bhagnani Make Their Relationship Insta  Official On The Actress' Birthday With A Mushy Post

`జాకీతో త‌న ప్రేమ విష‌యాన్ని అందరితో పంచుకోవాలనుకున్నా. అయితే త‌మ పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. ఇప్ప‌టికైతే పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న లేదు.` అని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ చెప్పుకొచ్చింది. అయితే జాకీ భగ్నానీకి మాత్రం త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవాల‌నుంద‌ట‌. కానీ, ర‌కుల్ ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌న పెట్టుకోవ‌ద్ద‌ని చెప్ప‌డంతో.. అత‌డు గుర్రుగా ఉన్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh dating Jacky Bhagnani : r/BollyBlindsNGossip

కాగా, ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే..ఇప్పుడీమె బాలీవుడ్ లో ఎటాక్‌, మేడే, థ్యాంక్‌ గాడ్‌, డాక్టర్ జీ, మిషన్‌ సిండెరెల్లా చిత్రాలు చేస్తుంది. వీటిలో థ్యాంక్‌ గాడ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు తెలుగులో అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌, తమిళంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తుంది ర‌కుల్‌.