ఘ‌నంగా కార్తికేయ వివాహం..సంద‌డి చేసిన సినీ తార‌లు వీళ్లే!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడు అయ్యాడు. నేడి ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ద‌గ్గ‌రి బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రియురాలు లోహిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ‌. హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన వీరి వివాహానికి సినీ ఇండ‌స్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత‌ అల్లు అర‌వింద్‌, డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సాయి కుమార్ త‌దిత‌రులు హాజ‌రై..నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Actor Karthikeya: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన హీరో కార్తికేయ ఫోటోలు... పెళ్లి కొడుకుగా రెడీ - OK Telugu

ప్ర‌స్తుతం కార్తికేయ‌-లోహిత‌ల వివాహానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, `ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ‌.. మొద‌టి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత హిప్పీ, గుణ 369, 90ఎంఎల్, చావు కబురు చల్లగా చిత్రాల్లో న‌టించారు.

Image

కానీ, ఈ చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక వారం రోజుల క్రితం ఈ యంగ్ హీరో న‌టించిన‌ `రాజా విక్రమార్క` చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన ఈ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుని ఓ మాదిరి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది.

Image

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ‌.. లోహితా రెడ్డిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వ‌రంగ‌ల్‌లో బీటెక్ చేసినప్పుడు ఇద్దరికీ పరిచయం అయ్యింద‌ని.. అది ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి దారి తీసింది తెలిపిన కార్తికేయ‌.. అంద‌రి ముందూ ఆమెకు రోమాంటిక్‌గా ప్ర‌పోజ్ కూడా చేశాడు.

Image

Share post:

Latest