వైసీపీలోకి జంప్ చేసిన ఆ నేత‌కు టెన్ష‌న్ మోద‌లైందా…!

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు భ‌ద్ర‌త ముఖ్య‌మే. కానీ, అభ‌ద్ర‌తే ఇబ్బంది! మ‌ళ్లీ గెలుస్తామో.. లేదో.. ప్ర‌జ‌లు త‌మ కు జైకొడ‌తారో.. లేదో.. అనే అభ‌ద్ర‌త‌.. కొంద‌రు నాయ‌కుల‌ను నిలువునా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని త‌ర్వాత‌.. వైసీపీ చెంత‌కు చేరిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుల్లో క‌ర‌ణం ఒక‌ర‌ని అంటారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. క‌ర‌ణం పేరుకు సీనియ‌ర్ అయినా ఆయ‌న తిర‌గ‌ని పార్టీ అంటూ లేదు. జ‌న‌తా, కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ ఇలా ఆయ‌న ప‌లు పార్టీలు మారారు. ఆయ‌న టీడీపీలోకి రెండు సార్లు వెళ్లి మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చారు. గ‌త ప్ర‌భుత్వంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఓడినా అధికార పార్టీలో ఉండ‌డంతో అధికారం అనుభ‌వించిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచానా పార్టీ ఓడిపోవ‌డంతో ఇప్పుడు వైసీపీ చెంత చేరారు.

Ongole: Karanam Balaram, son likely to join YSRCP soon

అయితే క‌ర‌ణం అభ‌ద్ర‌తా భావంలో ఉన్నారా ? అన్న సందేహాలు ఇప్పుడు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ ఇవ్వ‌క‌పోతే త‌న‌, త‌న వార‌సుడి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంటి ? అని ఆయ‌న త‌ర‌చుగా మ‌ద‌న ప‌డుతున్నాడ‌ట‌. దీంతో వైసీపీలో ఉండి కూడా ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను, ఆయ‌న పాల‌నను మెచ్చుకునే సాహ‌సం చేయ‌లేక పోతున్నారు. పోనీ.. జ‌గ‌న్‌ను న‌మ్ముకుని.. వైసీపీలోకి వ‌చ్చిన క‌ర‌ణం.. అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపైనైనా.. విమర్శలు చేస్తున్నారా? పోనీ టీడీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ అయినా.. ఇస్తున్నారా ? అంటే అది కూడా లేదు. ఎంత సేపూ.. త‌న సీటును కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

YCP Gave Strong Warning To Karnam On Chirala Issue Karanam Balaram YSRCP AP CM YS Jagan MLC MLA Minister Balineni Ap Politics Sajj-TeluguStop

కేవ‌లం అధికారం కోస‌మే ఆయ‌న పార్టీ మారారే త‌ప్పా.. అంత‌కు మించి ఆయ‌న వ‌ల్ల వైసీపీకి ఒరిగిందేమీ లేద‌న్న భావ‌న వైసీపీ వ‌ర్గాల‌కు కూడా వ‌చ్చేసింద‌ట‌. అధికారం కోస‌మే త‌ప్ప‌.. త‌న‌కు పార్టీలో మంచి పొజిష‌న్ ఇచ్చిన‌.. జ‌గ‌న్‌ను మెచ్చుకునేందుకు ఆయ‌న‌కు మ‌న‌సు రావ‌డం లేద‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌, ఆయ‌న కుమారుడు.. క‌ర‌ణం వెంక‌టేష్ కూడా ద్వంద్వ వైఖ‌రిని అవ‌లంభిస్తున్నార‌నే చ‌ర్చ జోరుగానే సాగుతోంది. టీడీపీని తిట్ట‌డంలేదు, లోకేష్‌ను తిట్ట‌రు. బాబును తిట్ట‌రు. అంతేకాదు.. టీడీపీ నేత‌ల‌తో క‌ర‌ణం వెంక‌టేష్ ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

YSRCP seeks arrest of Naidu, Lokesh for social media post on Gurumurthy

సోష‌ల్ మీడియా గ్రూపుల్లో టీడీపీ నేత‌ల‌తో ముచ్చ‌టిస్తూనే ఉన్నార‌ని.. చీరాల వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతుం టాయి. అంతేకాదు.. ఎంత‌వ‌ర‌కు చీరాల వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. ఆమంచినే టార్గెట్ చేయ‌డం వెనుక రీజ‌నేంటి? అంటే.. ఆయ‌న ఎక్క‌డ బ‌లోపేతం అయిపోతారో.. అనే ఒకే ఒక దిగులు.. ఆవేద‌న‌.. ఆందోళ‌న‌., నిజానికి మాస్ లీడ‌ర్‌గా గుర్తింపు ఉన్న ఆమంచికి ఎవ‌రో వ‌చ్చి స‌ర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు., అయినా.. కూడా క‌ర‌ణం వైఖ‌రి చూస్తే.. ఇప్పుడు ఉన్న పార్టీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉంటాడో ఉండ‌రో తెలియ‌ని ప‌రిస్థితితో పాటు.. త‌ను ఎక్క‌డ ఓడిపోతానోన‌నే అభ‌ద్ర‌త కూడా వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు విశ్లేష‌కులు.