వింతలకే వింత..ఆపరేషన్ టైమ్‌లో ఏడ్చినందుకు డాక్ట‌ర్లు అలా చేశార‌ట‌?

ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఏడ్పు రావ‌డం స‌ర్వ సాధార‌ణం. భ‌య‌మేసో, బాధేసో ఏడుస్తుంటారు. కానీ, అమెరికాలో వింత‌ల‌కే వింత ఒక‌టి చోటుచేసుకుంది. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఓ యువ‌తి ఏడ్చినందుకు అద‌న‌పు బిల్లు వేసి డాక్ట‌ర్లు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

UK MPs urged to ban 'virginity repair' surgery as well as virginity testing | Health | The Guardian

అమెరికాలో మిడ్జ్ అనే యువతి పుట్టుమచ్చను తొలగించుకోవడానికి హాస్ప‌ట‌ల్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేస్తుండ‌గా.. భయమేసి మిడ్జ్ ఏడ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే డిశ్చార్జి సమయంలో వేసిన బిల్లు చూసిన ఆమెకు బిగ్ షాక్ త‌గిలింది.

SHOCKING: Woman claims she was charged for crying during surgery, bill lists it as 'brief emotion' | Trending & Viral News

ఎందుకంటే ఆ బిల్లులో ఆమె ఏడ్చినందుకు కూడా రూ.800 బిల్లు వేశారు. దాంతో చేసేదేమి లేక బిల్లు క‌ట్టేసింది మిడ్జ్‌. అనంత‌రం ఆ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఏడ్చినందుకు కూడా బిల్లు వేస్తారని తను అసలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక ఆమె పోస్ట్ చూసిన నెటిజ‌న్లు అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థను త‌ప్పుబ‌డుతూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.