వ‌రుణ్ తేజ్ కీల‌క నిర్ణ‌యం..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌..?!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గ‌ని` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 3న విడుద‌ల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వ‌రుణ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు.

Ghani first look: Ram Charan unveils Varun Tej's boxer avatar | Entertainment News,The Indian Express

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాము న‌టించిన చిత్రాల‌ను హిందీలోకి డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా.. స్ట్రైట్ హిందీ మూవీస్ కూడా చేస్తున్నారు.

Actor Varun Tej has a Great Escape In a Road Accident

అయితే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కూడా ఓ స్ట్రైట్ హిందీ మూవీ చేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. ఇందులో భాగంగానే ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థతో వ‌రుణ్ చర్చలు జ‌రుపుతున్నాడ‌ని టాక్‌. ఇక అన్నీ సెట్టైతే త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు త‌న బాలీవుడ్ ఎంట్రీపై వ‌రుణ్ గుడ్‌న్యూస్ చెప్ప‌వచ్చ‌ని అంటున్నారు.

Share post:

Latest