సాయి తేజ్ హెల్త్‌పై వైష్ణ‌వ్ న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Sai Dharam Tej In Coma - Clarity Here!

ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉంద‌ని మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డిశ్చార్జ్ కాక‌పోవ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ త‌మ్ముడు, యంగ్ హీరోగా వైష్ణ‌వ్ తేజ్ అన్న ఆరోగ్యంపై న్యూ అప్డేట్ ఇచ్చారు.

Finally, Sai Dharam Tej Comes Out to Wish His Brother

తాజాగా తాను న‌టించిన `కొండపోలం` మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతున్న వైష్ణ‌వ్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సాయి తేజ్ హెల్త్‌పై స్పందించాడు. తేజు ఆరోగ్యం బావుంది. త్వరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం తేజుకి ఫిజికల్ థెరపీ జరుగుతోంది. బహుశా మరో వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వెల్ల‌డించారు.

Share post:

Latest