టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమైంది.. ఎందుకిలా అవుతోంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సాయి ధరమ్ తేజ్ గాయపడటంతో అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని తాను కోలుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే.

మరొక హీరో అడవి శేషు కూడా డెంగు జ్వరం కారణంగా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అడవి శేష్ తాను కోలుకుని ఇంటికి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే హీరో సిద్ధార్థ్ మహాసముద్రం సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. అతడి వెన్నెముక గాయం అవడంతో సర్జరీ కోసం లండన్ కి వెళ్లి కొద్ది రోజుల కిందటి ఇండియాకు వచ్చాడు. అలాగే హీరో రామ్ పోతినేని మెడకు గాయం అయిన సంగతి కూడా తెలిసిందే. అతను నటిస్తున్న తాజా చిత్రం రాపో 19 వ సినిమా కోసం జిమ్ లో విపరీతంగా కసరత్తులు చేస్తున్న సమయంలో రామ్ గాయపడ్డాడు.దీనితో వైద్యులు అతడిని కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఇలా వేర్వేరు కారణాలతో వరుసగా యువహీరోలు ఆసుపత్రి పాలవడంతో అభిమానులతో ఆందోళన నెలకొంది.

Share post:

Popular