ఏపీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన మైత్రి, డివివి దిల్ రాజు

కరోనా మహమ్మారి ఇంకా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. దీనితో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు ఫలించలేదు అంతేకాకుండా థియేటర్లను కూడా తెరవలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో థియేటర్లను తెలిసినప్పటికీ అవి కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తోనే నడుస్తు వచ్చాయి. రోజుకు మూడు ఆటలే వేసేవారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. థియేటర్లను 100% ఆక్యుపెన్సీ తో రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చు అని ప్రకటించింది.

దీనితో ఏపీ ప్రభుత్వం పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ తీపి కబురు ఇండస్ట్రీలో అందరినీ సంతోష పరిచింది. ఈ మేరకు దిల్ రాజు స్పందించి 100% ఆక్యుపెన్సీ తో థియేటర్లు ప్రారంభించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి థాంక్స్. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మంత్రి పేర్ని నాని గారి సహాయానికి థాంక్స్. ఈ గుడ్ న్యూస్ సినీ ఇండస్ట్రీకి ఊపిరినిచ్చే అంశం అని తెలిపారు. అలాగే ఈ విషయంపై డివివి స్పందిస్తూ థియేటర్లను 100% ఆక్యుపెన్సీ ప్రకటించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటాను అని తెలిపింది. అలాగే మైత్రి మూవీస్ కూడా ప్రతిరోజు 4 షోలు 100% ఆక్యుపెన్సీ తో అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అలాగే మంత్రి పేర్ని నాని కి ధన్యవాదాలు అని తెలిపింది.