త‌మ‌న్నాపై మ‌న‌సు పారేసుకున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. గ‌త కొన్నేళ్ల నుంచీ తెలుగు, త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా..దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

Happy Birthday Sampath Nandi: Some working stills from his next film Seetimaarr | Telugu Movie News - Times of India

తనదైన అందం, న‌ట‌న‌తో ప్రేక్షకుల‌నే కాదు తోటి సెల‌బ్రెటీల‌ను సైతం మంత్రముగ్ధుల్ని చేసే ఈ పాల రాతి శిల్పంపై ఓ డైరెక్ట‌ర్ మ‌న‌సు పారేసుకున్నార‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. అవును, సంపత్ నందికి త‌మ‌న్నా అంటే అమిత‌మైన ఇష్ట‌మ‌ట‌.

Sampath Nandi using Lucky Mascot Again!

ఆమె చేసే నటన, డాన్సులను సంపత్ నంది ఎంతో ఇష్టపడతార‌ట‌. అందువ‌ల్లే సంపత్ నంది తాజాగా తాను తెర‌కెక్కించిన సిటీ మార్ చిత్రంలో తమన్నాను ఎంపిక చేసుకున్నార‌ట. ఇక గ‌తంలోనూ త‌మ‌న్నాతో రచ్చ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలు చేసిన సంప‌త్‌.. త్వ‌ర‌లోనే మిల్కీ బ్యూటీకి మ‌రో అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది.