`అఖండ‌`లో త‌న పాత్ర‌పై శ్రీ‌కాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయ‌మ‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Akhanda - Official Trailer | Telugu Movie News - Times of India

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. అఖండ‌లో త‌న పాత్ర‌పై కొన్ని లీకులు వ‌దిలారు. ఆయ‌న మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ గా తెరపై నేను ఎలా కనిపిస్తాననేది ఎవరూ ఊహించలేరు. అంత డిఫ‌రెంట్‌గా ఈ పాత్ర‌ను డిజైన్ చేశారు. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారు.

Balakrishna's stunning take on Srikanth

ఆ సినిమాలో నేను చాలా భయంకరంగా .. క్రూరంగా కనిపిస్తాను. ఆ సినిమా చూస్తూ ఆడియన్స్ ఖ‌చ్చితంగా తిట్టుకుంటారు. అంత దుర్మార్గంగా ఆ పాత్ర ఉంటుంది. అయితే నాకు మాత్రం చాలా వైవిధ్యభరితమైన పాత్రలో చేశాననే సంతృప్తి కలిగింది. ఈ రోల్ నా కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుంది` అంటూ శ్రీ‌కాంత్ చెప్పుకొచ్చారు. దాంతో వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.