`మా` ఎన్నిక‌ల్లో గెలుపు వారిదే..తేల్చేసిన తాజా స‌ర్వే..?!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయ్యాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్న మా ఎన్నిక‌ల్లో ఓవైపు మంచు విష్ణు ప్యానెల్‌, మ‌రోవైపు ప్రకాష్ రాజ్ స్యానెల్ హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు.

- Advertisement -

Movie Artist Association complain to police on morphing websites

ఓట్లు రాబట్టుకోవడానికి ఇరువైపుల వారు హద్దుల్ని దాటి ప్రచారాలు చేశారు. దాంతో ఈ `మా` వార్‌లో గెలిచేది ఎవ‌రు..? అన్న‌ది ఉత్కంఠగా మారింది. అయితే ఇలాంటి త‌రుణంలో సోషల్ పొలిటికల్ అనాలిసిస్ రీసెర్చ్ సెంటర్ (SPARC) మా ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో తేల్చేసింది.

Your Film Budget Equals Pawan's Morning Show Collection', Prakash Raj To Vishnu -

తాజాగా ఎస్పీఎఆర్సీ మా ఎన్నికలపై ప్రీ-పోల్ సర్వే నిర్వహించ‌గా.. అందులో మంచు విష్ణునే గెలుస్తాడ‌ని తేలింది. మొత్తం 950 ఓట్ల‌లో.. 450 నుండి 551 ఓట్లను మంచు విష్ణు పొందే అవకాశం ఉంద‌ని.. ఇక‌ 200 నుండి 257 మంది ప్రకాష్ రాజ్‌కు ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వేలో తేలింది. మ‌రి ఈ స‌ర్వే ఎంత వ‌ర‌కు నిజం అవుతుందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular