బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కార‌ణం అదే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన ముంబై హై కోర్టు.. ఎట్ట‌కేల‌కు నిన్న ఆర్య‌న్ ఖాన్‌కి ఊర‌ట‌నిచ్చింది.

Shah Rukh Khan's Son, Aryan Khan Denied Bail In Drugs-On-Cruise Case, To Spend Night In Jail

ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్ మాత్రం ఇంకా ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లోనే ఉన్నారు.

Shah Rukh Khan visits Aryan Khan at Arthur Road after the latter's bail plea got rejected, Entertainment News | wionews.com

బెయిల్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి కారణం. హైకోర్టు జడ్జి ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు డీటెయిల్డ్ ఆర్డర్ ను చదివి వినిపించనున్నారు. బెయిల్ కు విధించబోయే షరతులను తెలియజేయనున్నారు. ఆ తర్వాత బెయిల్ ఆర్డర్స్ జైలుకు వెళ్తాయి. అనంతరం నిబంధనల ప్రకారం జైల్లో అన్నీ పూర్తయిన తర్వాత ఆర్యన్ విడుదల అవుతాడు.