ఇదెక్కడి న్యాయం అంటున్న ప్రముఖ యాంకర్ …?

విద్యార్థుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వకుండా… విద్యార్థులను స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అనసూయ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా ఉంది.

” కేటీఆర్ సర్.. కరోనా కారణంగా లాక్ డౌన్ పాటించాం. ఆ తర్వాత అన్ లాక్ చేశారు. అప్పటినుండి దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోనసాగుతోంది. కానీ వాక్సిన్ వేసుకోవాల్సిన వయసు కంటే తక్కువ వయసున్న పిల్లల సంగతి ఏంటి సార్?? పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి, దానికి తల్లిదండ్రుల్లో అంగీకార పత్రం రాసి ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి . ఇదెక్కడి న్యాయం చెప్పండి సర్? ఈ విషయాన్ని మీరు సమ్మె చేస్తారని భావిస్తున్నాను అంటూ మంత్రి కేటీఆర్ కు అనసూయ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.