కోర్టులో ఆర్య‌న్ ఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌..ఆందోళ‌న‌లో షారుఖ్ దంప‌తులు!

రీసెంట్‌గా డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా బుక్కైన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి కోర్టులో మ‌ళ్లీ షాక్ త‌గిలింది. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.

Drugs case: Aryan Khan speaks to Shah Rukh, Gauri Khan via video call from jail; gets Rs 4,500 via money-order | Mumbai News

ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్ మ‌రియు అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి అక్టోబర్ 2 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది.

Gauri wins an award. Shah Rukh Khan reacts and wins the Internet - Movies News

ఆర్యన్‌ను అక్టోబర్ 8 న ఆర్థర్ రోడ్ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక అప్ప‌టి నుంచీ న్యాయవాదులు పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

Share post:

Latest