`ఆదిపురుష్`లో త‌న ప‌ని కానిచ్చేసిన లంకేశుడు..గ్రాండ్‌గా సెండాఫ్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతున్న ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ లంకేశుడిగానూ నటిస్తున్నారు.

Image

అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానున్న ఈ చిత్రం టి సిరీస్, రెట్రోఫైల్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితమ‌వుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ లో త‌న ప‌ని కానిచ్చేశాడు లంకేశుడు. అవును, సైఫ్ ఆలీఖాన్ త‌న పాత్ర‌కు సంబంధించిన షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాడు.

Image

ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఓం రౌత్ స్వ‌యంగా తెలియ‌జేశారు. అంతేకాదు, తన షూట్ పూర్తైన‌ సందర్భంగా సైఫ్‌కు ఆదిపురుష్ టీమ్ గ్రాండ్‌గా సెండాఫ్ కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ సంద‌ర్భంగా ఆదిపురుష్ వంటి భారీ ప్రాజెక్ట్‌లో ప్ర‌భాస్ లాంటి జెంటిల్మెన్‌తో క‌లిసి ప‌ని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని సైఫ్ చెప్పుకొచ్చాడు.

Share post:

Latest