డిశ్చార్జ్ అయిన‌ సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కానీ, ఆ చెయ్యి పని చెయ్యద‌ట‌?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. అయితే నెల‌కు పైగా అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకున్న తేజ్‌.. ఎట్ట‌కేల‌కు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వ‌యంగా వెల్లడించారు.

- Advertisement -

Tollywood actor Sai Dharam Tej injured in road accident, condition stable | Celebrities News – India TV

విజ‌య‌ద‌శ‌మి రోజు చిరు అదిరిపోయే శుభవార్త‌ను చెప్ప‌డంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్‌లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ తగలడం చేత ఆ చెయ్యితో ఎలాంటి పనులు చేయలేరు అంటూ ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sai Dharam Tej and Deva Katta next film updates - Telugu Premiere

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, సెప్టెంబర్ 10న సాయి ధరమ్‌తేజ్‌ హైద‌రాబాద్ నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందకు పడిపోయారు. ఈ ప్ర‌మాదంలో తీవ్ర గాయాలైన సాయ్ తేజ్‌కి అపోలో హాస్ప‌ట‌ల్‌లో ఓ ప్ర‌త్యేక‌మైన వైద్య బృందం చికిత్స అందించారు. చికిత్సలో భాగంగానే ఆయనకు కాలర్‌ బోన్‌ సర్జరీ కూడా జరిగింది.

Share post:

Popular