RRR మూవీ నుంచి బిగ్ అప్డేట్ ..!

October 25, 2021 at 7:12 am

రాజమౌళి డైరెక్షన్లో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా RRR ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమాలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ అయినా, ట్రైలర్స్ అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ రాబోతున్నట్లు గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా నుండి టీజర్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది అన్నట్లుగా సమాచారం.

అది ఇది ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న ట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం కనుక ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందంటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

RRR మూవీ నుంచి బిగ్ అప్డేట్ ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts