ఆర్యన్ ఖాన్ ని రిలీజ్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో మద్దతు?

బాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయమే వినిపిస్తోంది. ఆర్యన్ ఇటీవలే దర్శి కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అతనితో పాటు మరో ఏడుగురు కూడా అరెస్టు అయ్యారు.

ఇక తాజాగా గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు ఈ కేసును స్పెషల్ ఎన్ డిపీఎస్ కోర్టుకి అప్పగించింది. దీంతో శుక్రవారం మరొకసారి అతని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ కి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటికే ఆర్యన్ ఖాన్ కి బాలీవుడ్లో పలువురు ప్రముఖులు మద్దతు తెలపగా, షారుక్ అభిమానులు ఫ్యామిలీకి అలాగే ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా అతని దగ్గర డ్రగ్స్ దొరకలేదు. అలాగే అతను డబ్బులు తీసుకోలేదు,

అయినా కూడా అతన్ని జైలులో ఉంచడం కరెక్టు కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనితో ట్విట్టర్లో # ReleaseAryanKhan అన్న యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి