అదిరే డ్ర‌స్‌లో ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!

October 16, 2021 at 10:57 am

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కేరటం` మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీడాల్‌..తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస‌ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Rakul Preet Singh walks the ramp for Sonaakshi Raaj at BTFW - Times of India

ఇదిలా ఉంటే.. తాజాగా ర‌కుల్ బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో నేవీ బ్లూ లెహంగా ధ‌రించి పోనీటైల్ వేసుకుని ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసేసింది. ర‌కుల్ అందాల‌కు మ‌రియు ఆమె ర్యాంప్‌కు వాక్‌కు.. అక్క‌డి వీక్ష‌కులు ఫిదా అయిపోయారు.

Rakul Preet Singh walks the ramp for Sonaakshi Raaj at BTFW - Times of India

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల `కొండ పొలం`తో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన ఈ భామ‌..అక్టోబ‌ర్ 31 లేడీస్ నైట్ అనే ద్విభాషా చిత్రం చేస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ఎటాక్‌, మేడే, థాంక్ గాడ్‌, డాక్ట‌ర్ జీ చిత్రాల్లో ర‌కుల్ న‌టిస్తోంది.

అదిరే డ్ర‌స్‌లో ర్యాంప్ వాక్ ఇర‌గ‌దీసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts