రాజా విక్రమార్క ట్రైలర్ విడుదల చేయబోతున్నా యంగ్ హీరో..!

October 31, 2021 at 2:26 pm

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమాని సాయి శ్రీ వల్లి డైరెక్షన్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో తెరకెక్కించ పడుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు హీరో కార్తికేయ. ఈ చిత్రం నుంచి మేకర్స్ త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం.

నవంబర్ 1వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం. ఇదివరకే ఈ ఇద్దరు హీరోలు కూడా గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. పైగా ఈ సినిమా టైటిల్ మెగాస్టార్ సినిమా టైటిల్ కావడం విశేషం. మరి నాని రిలీజ్ చేసి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందో అంటూ కార్తికేయ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ సినిమా సక్సెస్ కావాలని మనము కోరుకుందాం.

రాజా విక్రమార్క ట్రైలర్ విడుదల చేయబోతున్నా యంగ్ హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts