పూజా హెగ్డే బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `రాధేశ్యామ్‌` టీమ్‌!

October 13, 2021 at 11:11 am

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్‌` ఒక‌టి. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరో రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మ‌రియు ప్రసీదాలు నిర్మించారు.

Image

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. అయితే నేడు పూజా హెగ్డే బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా రాధేశ్యామ్ టీమ్ ఓ అదిరిపోయే పోస్ట‌ర్ విడుద‌ల చేసి సూప‌ర్ ట్రీట్ ఇచ్చింది.

Pooja Hegde's vintage looks as Prerana from Radhe Shyam - Movies News

ఈ తాజా పోస్ట‌ర్‌లో వైట్ ఫ్రాక్ ధ‌రించి ఉన్న‌ పూజా హెగ్డే అందంగా మెరిసిపోతోంది. ఈ పోస్టర్ ని చూస్తే సాంగ్ లోనిదా లేక సన్నివేశామా అనేది తెలియ‌దు కానీ విజువల్ మాత్రం చాలా గ్రాండ్‌గా వింటేజ్ ఫీల్ ని తీసుకొస్తుంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

పూజా హెగ్డే బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `రాధేశ్యామ్‌` టీమ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts