ఓటీటీలో గోపీచంద్ సినిమా …?

గోపీచంద్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి నడిపిన సినిమా సీటిమార్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్బంగా తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు.మళ్ళీ ఈ సినిమాను దసరా పండగ కానుకగా అక్టోబర్ 15న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సినిమాను హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు స్పష్టం చేసారు. థియేటర్స్ లో సినిమా చూడని వారు ఎంచక్కా దసరా పండగ సందర్బంగా ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో గోపీచంద్ క్రికెట్ టీమ్ కు కోచ్ గా నటించాడు. అలాగే తమన్నా నటన కూడా ఈ సినిమాకు ఒక హైలెట్ అనే చెప్పాలి.

Share post:

Latest