రాజ‌మౌళి బ‌ర్త్‌డే..రామ్‌-భీమ్‌లు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. త‌న 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయ‌మే ఎరుగని జ‌క్క‌న్న.. త‌న సినిమాల‌తో కొల్ల‌గొట్టిన రికార్డులు కొక‌ల్లు. ప్ర‌స్తుతం ఈయ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రంలో చ‌ర‌న్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు.

Happy Birthday SS Rajamouli: Pan-Indian celebs queue to wish Jakkanna on social media | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే.. నేడు రాజ‌మౌళి బ‌ర్త్‌డే. దాంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు, సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే రామ్‌-భీమ్‌లు కూడా రాజ‌మౌళికి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

Image

డియర్ జక్కన హ్యాపీ బర్త్ డే టు యు. లవ్ యూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయ‌గా.. హ్యాపీ బ‌ర్త్‌డే రాజ‌మౌళి గారూ అంటూ చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌లు ఆర్ఆర్ఆర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్స్ ను సైతం రివిల్ చేశారు. ప్ర‌స్తుతం ఈ స్టిల్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Image

https://twitter.com/tarak9999/status/1447051692193714178?s=20

https://twitter.com/AlwaysRamCharan/status/1447073226392162305?s=20