త‌గ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది.

- Advertisement -

Shyam Singha Roy: Nani, Sai Pallavi, Krithi Shetty To Play Lead Roles! Film To Go On Floors In December

అయితే గ‌త రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌ని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెన‌క్కి త‌గ్గ‌నున్నాడ‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఆ వార్త‌లు కేవ‌లం పుకార్లే అని తేల్చేసిన నాని.. వెన‌క్కి త‌గ్గేదే లే అని అంటున్నారు. అవును, తాజాగా మేక‌ర్స్ శ్యామ్ సింగ రాయ్ డిసెంబ‌ర్ 24నే రానుంద‌ని మ‌రోసారి క‌న్ఫార్మ్ చేశారు.Image

అంతేకాదు, మ‌రో బిగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 6వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్న మేక‌ర్స్ అధికారికంగా తెలుపుతూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. కాగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు.

Share post:

Popular