బిగ్‌బాస్ 5: ర‌వినే టార్గెట్ చేసిన‌ నాగ్‌..అదే అత‌డికి ప్ల‌స్ అవుతుందా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆరో వారం కూడా పూర్తి కాబోతోంది. నిన్న శ‌నివారం కావ‌డంతో కింగ్ నాగార్జున ఇంటి స‌భ్యులంద‌రికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. ఈ క్ర‌మంలోనే ర‌వి ఇమేజ్‌ను నాగ్ డ్యామేజ్ చేసేశారు. బిగ్ బాస్ ఇచ్చిన‌ టాస్క్‌లో ర‌వి అంద‌రితో కుషన్స్ క‌ట్ చేయించి తాను సేఫ్‌గా ఉన్నాడు. ఇదే విష‌యంపై నాగార్జున అత‌డిని ప్ర‌శ్నించాడు.

అందుకు ర‌వి మాట్లాడుతూ.. `నేను వాళ్లతో తప్పు చేయించి పక్కకు తప్పుకోవాలని అనుకోలేదు సార్.. నేను ఆ దిండ్లు చింపి కాటన్ తీద్దాం అనుకున్నా.. కానీ కత్తెర కనిపించలేదు.. ఇక శ్వేతాకి నేనేమీ చెప్పకుండా ఆమె దిండ్లు కట్ చేసి కాటన్ తీసింది.` అని చెప్పాడు రవి. దీంతో శ్వేతా రియాక్ట్ అయ్యి.. `ఇతను అబద్ధం ఆడుతున్నాడు సార్.. నేను పిల్లోలో కాటన్ తీస్తున్న విషయం అతనికి చెప్పాను` అంటూ చెప్పేసింది. నువ్ స్ట్రాటజీలు చేయి రవి తప్పులేదు.. కానీ బ్లేమ్ చేయకు అంటూ నాగ్ క్లాస్ పీకారు.

Bigg Boss 5 Telugu - Anchor Ravi: మరోసారి అడ్డంగా దొరికిపోయిన యాంకర్ రవి.. నువ్వు గుంటనక్కవే అంటూ..!

అలాగే రవి చేసింది కరెక్టా తప్పా అన్నది హౌస్‌లో ఉన్నవాళ్లే చెప్పండి అని నాగ్ ప్ర‌శ్నించ‌గా.. ఇంటి స‌భ్యులంద‌రూ ర‌విదే త‌ప్పంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. దాంతో `నిజం ఏంటో నాకు తెలుసు సార్.. నాకు అనిపించింది చేస్తా..`అని ర‌వి అన‌డంతో.. `ఎవరైనా తప్పు చేస్తే చెప్పడం నా బాధ్యత అది నీకు చెప్తున్నా.. దాని తరువాత నీ ప్రవర్తన నీ ఇష్టం` అని నాగ్ తెలిపారు. మొత్తానికి నిన్న‌టి ఎపిసోడ్‌లో నాగ్ ర‌వినే టార్గెట్ చేస్తూ ఘోరంగా అవ‌మానించారు. అయితే ఇప్పుడు అదే ర‌వికి ప్లస్ అయ్యేలా క‌నిపిస్తోంది. అత‌డు చేసింది తప్పే కావచ్చు కానీ ఇంతలా నాగ్ రియాక్ట్ అవ్వాలా అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ర‌వికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.