అఖిల్ పుట్టాడ‌ని ఎంతో బాధ‌ప‌డ్డ నాగార్జున‌..ఎందుకో తెలుసా?

అక్కినేని అఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ అఖిల్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్టే అందుకోలేక‌పోయాడు. అయితే తాజాగా ఈయ‌న న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చిత్రం మాత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌లై ఘన విజయం సాధించింది.

- Advertisement -

Over-expectation and pressure have been my worst enemies: Akhil Akkineni | The News Minute

దాంతో తొలి హిట్‌ అందుకున్న అఖిల్ ప్ర‌స్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ.. ఆయ‌న‌కో కోరిక ఉండేద‌ని, కానీ అది నెర‌వేర‌లేద‌ని చెప్పుకొచ్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమల గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు నాగ్ ఆడ‌పిల్ల పుట్టాల‌ని ఎంత‌గానో ఆశ‌ప‌డ్డాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమెరికాలో అమ‌ల‌కు ప‌రీక్ష‌లు చేయించ‌గా..వైద్యులు కూడా అమ్మాయి పుడుతుందని చెప్పార‌ట‌.

What made Nagarjuna so angry that he stopped talking to wife Amala for a month? What was the fight about? - IBTimes India

దాంతో త‌న కోరిక నెర‌వేరుతుంద‌ని ఉబ్బిత‌బ్బిపోయిన నాగ్‌.. పుట్ట‌బోయే కూతురికి `నికిత` అని పేరును పెట్టాల‌నుకున్నార‌ట‌. అలాగే కూతురికి గౌన్లు, సాక్సులు, గ్లౌసులు ఇలా అన్నీ ముందే కొనేశార‌ట‌. కానీ, అమలకు డెలివరీ తర్వాత అబ్బాయి పుట్టాడని చెప్పడంతో నాగ్ ఒక్క‌సారిగా షాక్ అయ్యార‌ట‌. అంతేకాదు, అమ్మాయి పుట్ట‌లేద‌ని ఎంతో బాధ ప‌డ్డార‌ట‌. మొత్తానికి నాగార్జున‌-అమ‌ల దంప‌తుల‌కు నికిత పుడుతుంద‌నుకుంటే.. అఖిల్ పుట్టాడ‌న్న‌మాట‌.

28 years of Togetherness for Nagarjuna and Amala Akkineni: Love Story in PICS | Telugu Movie News - Times of India

Share post:

Popular