దసరాకు బాక్స్ ఆఫీస్ పండుగ.. ఈ సారి మామూలుగా ఉండదు?

దసరా పండుగకు బాక్స్ ఆఫీస్ పండుగ జరగబోతోంది . దసరాకు వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఈసారి దసరాకు బాక్సాఫీస్ గట్టిగానే జరగబోతోంది అనిపిస్తోంది. కరోనా సమయంలో కొంచెం బ్రేక్ వచ్చిన తరువాత ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్ లో వార్ కోసం సిద్ధమౌతోంది.నేడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయింది.

అలాగే వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండపొలం సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా రకుల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మహాసముద్రం సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది. అలాగే అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుంది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందడి సినిమా కూడా అక్టోబర్ 15 న విడుదల కాబోతోంది. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమా అక్టోబర్ 29 న విడుదల కానుంది.

Share post:

Popular