ట్రైల‌ర్‌తో అఖిల్ రికార్డులు..మ‌రి సినిమాతో కొడ‌తాడా?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు.

Image

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్ ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబ‌ర్ 30న‌ ఈ మూవీని ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్‌.. తాజాగా 10 మిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసేసి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ వ్యూస్ ద‌క్కించుకున్న‌ ట్రైల‌ర్‌గా రికార్డును అందుకుంది.

Few hours to go: Most Eligible Bachelor today

అంతేకాదు, ఇప్ప‌టికీ ఈ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే కొన‌సాగుతోంది. మ‌రి ట్రైల‌ర్‌తో బాగానే రికార్డులు క్రియేట్ చేస్తున్న అఖిల్‌.. సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని రికార్డు క్రియేట్ చేస్తాడో..లేదో..చూడాలి. కాగా, అఖిల్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్‌లో మూడు సినిమాలు చేయ‌గా.. మూడూ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. అందుకే ఈ సారి ఎలాగైనా విజ‌యం సాధించి హిట్ ట్రాక్ ఎక్కాల‌ని అఖిల్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

Share post:

Popular