సూప‌ర్ ఫ‌న్నీగా `మ‌ళ్లీ మొద‌లైంది` ట్రైల‌ర్‌..మీరు చూశారా?

సీనియ‌ర్ హీరో సుమంత్ తాజా చిత్ర‌మే `మ‌ళ్లీ మొద‌లైంది`. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్‌గా న‌టించ‌గా.. యాంక‌ర్ వ‌ర్షిణి, సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్‌, అన్నపూర్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న‌ ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Sumanth unveils the FIRST LOOK of his next film Malli Modalaindi; Shows different phases of life after divorce | PINKVILLA

అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు. అలాగే, కొన్ని విడాకులకు ముగింపు..` అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితంలో జరిగే పరిణామాలు.. సానుభూతుల మధ్య ట్రైలర్ సూప‌ర్ ఫ‌న్నీగా సాగింది.

Malli Modalaindi : వర్షిణితో సుమంత్ విడాకులు! | Malli Modalaindi

ఇక‌ మొదటి భార్య అయిన వర్షిణితో విడాకులు తీసుకున్న సుమంత్.. ఆ కేసులో తన భార్య తరపున వాధించిన లాయర్ నైనా గగోలిని చూసి ప్రేమలో ప‌డ‌తారు. మ‌రి వీరి ప్రేమ ఫ‌లించి పెళ్లి వ‌ర‌కు వెళ్లారా..లేదా..అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి అదిరిపోయిన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తుంది.

Share post:

Latest