`కొండ పొలం` మేకింగ్ వీడియో..చూస్తే గూస్ బామ్సే!

వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కొండ‌పొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు.

Obulamma from Konda Polam, starring Rakul Preet and Vaisshnav Tej, is like a nostalgic trip to the melodious 90s

అక్టోబర్ 8న థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే హీరో, హీరోయిన్‌తో స‌హా చిత్ర‌యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. అయితే తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ సినిమా షూటింగ్ కేవ‌లం 40 రోజుల్లోనే పూర్తి కాగా..దట్టమైన అడవులు – కొండ ప్రాంతాల్లో ప‌గ‌లు, రాత్రి అనే తేడా లేకుండా చాలా కష్టపడి తీసినట్లు మేకింగ్‌ వీడియో చూస్తేనే అర్థం అవుతోంది.

Kondapolam Movie OTT Platform, Streaming Release Date, Collections

నటీనటులు దర్శకుడు ఇతర మరియు సిబ్బంది.. ఇలా అందరి శ్రమ ఇందులో కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్ కోసం వైష్ణవ్ తేజ్ ఎన్నో ఫీట్లు వేశాడు. మొత్తానికి గూస్ బామ్స్ తెప్పిస్తున్న `కొండ పొలం` మేకింగ్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest