జోరుగా `మా` పోలింగ్‌..ఇప్ప‌టివ‌ర‌కు ఓటేసిన ప్ర‌ముఖులు వీళ్లే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌లు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల నుంచీ పోలింగ్ జోరుగా కొన‌సాగుతోంది. ఓటు వేసేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.

- Advertisement -

 Maa Elections : బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు​ హక్కును వినియోగించుకోనున్నారు... మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు...

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, రాశి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే మంచు లక్ష్మి, శ్రీకాంత్, నరేష్, శివబాలాజీ, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, మహర్షి రాఘవ, సాయి వెంకట్, ఖయ్యుమ్, వేణు, ఈటీవీ ప్రభాకర్, సాయి కుమార్‌, ఆది సాయి కుమార్‌, సీనియ‌ర్ హీరో వేణు.. త‌దిత‌రులు ఇప్ప‌టి వ‌ర‌కు ఓటు వేశారు.

 మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌కు ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌  మొదలైంది.  దీంతో వరుసగా అందరూ వచ్చి జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో  తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా, మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్లను లెక్కిస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అధ్యక్షుడి ఫలితాలు బ‌య‌ట‌కు రానున్నాయి. ఇక ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వీరిలో 883 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. అయితే వీరిలో 500 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకునే అవ‌కాశం ఉంది.

 Maa Elections : ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్... మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు...

 Maa Elections :మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు నువ్వా అన్నట్లుగా తలపడుతున్నాయి. రాజకీయ ఎన్నికల సమయంలో గొడవలు జరిగినట్లు గానే.. మా ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ఫైట్లు జరుగుతున్నాయి.

Share post:

Popular