ప్ర‌భాస్‌కి సిగ్గుండ‌దు..ఆ స‌మ‌యంలో చెల‌రేగిపోతాడంటున్న కృతి సనన్..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ భామ కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతుంది. అయితే ప్ర‌భాస్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి స‌న‌న్‌.. మొద‌టి నుంచీ ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ వ‌స్తోంది.

Adipursh: Prabhas welcomes & shares stunning photos with Kriti Sanon, Sunny Singh as they join Om Raut's film | PINKVILLA

ఒకానొక స‌మ‌యంలో కృతి ..ప్ర‌భాస్‌ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌ను ఫుల్ స్ట‌డీ చేసిన కృతి స‌న‌న్‌.. తాజాగా ఆయ‌న‌పై మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్ర‌భాస్ గురించి మాట్లాడుతూ.. `ఆయ‌న‌కు కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్తవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

Adipurush: Kriti Sanon To Be Sita To Prabhas' Lord Ram

కానీ, సెట్స్ లో అందరూ తెలిసిన వాళ్లే ఉంటే అస్స‌లు సిగ్గు ప‌డ‌రు. ఆ స‌మ‌యంలో అంద‌రిలోనూ క‌లివిడిగా మాట్లాడుతూ.. జోకులతో చెలరేగిపోతుంటాడు. అలాగే ప్రభాస్ వద్ద ఎప్పుడూ పాజిటివ్ వైబ్సే ఉంటాయి. అందుకే ఆయ‌నంటే నాకెంతో ఇష్టం` అంటూ కృతి స‌న‌న్ చెప్పుకొచ్చింది. దాంతో ఆమె వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Popular