అసలు సినిమా అంటే ఇదే అనిపిస్తుంది.. డైరెక్టర్ క్రిష్?

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమాను బిబో శ్రీనివాస్ సమర్పణలో వై రాజీవ్ రెడ్డి, జె సాయిబాబు, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. కొండపొలం ఫైనల్ కాఫీ చూసినప్పుడు ఇది సినిమా అంటే అనిపించింది. ప్రతి తెలుగు వాడు గర్వపడే సినిమా ఇది.

ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారు అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. అలాగే కీరవాణి గారు మా సినిమాకి ఒక గైడ్ గా పనిచేశారు. కొండపొలం హిట్ అనేది నాకు తెలుసు తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమాకి చాలా అవసరం అని తెలిపారు.నేను చాలా గొప్ప సినిమా, చాలా జాగ్రత్తగా తీశానని బలంగా నమ్మాను.ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు అన్నారు. హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ నా మొదటి చాప్టర్ ఉప్పెన అయితే రెండవ చాప్టర్ కొండపొలం.

ఈ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. క్రిష్ రాజీవ్ జ్ఞానశేఖర్ గార్లకు మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్ లో సాంకేతిక నిపుణులు పొడక్షన్ వారు చాలా కష్టపడ్డారు. వారందరూ కష్టమే ఈ కొండాపురం సినిమా. ఈ సినిమా జీవితంలో ఎన్ని సార్లు కింద పడ్డ లేవాలంటే ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది వైష్ణవి అన్నారు. అలాగే రవీంద్ర అనే ఒక మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు కృష్ కి థాంక్స్ తెలిపారు.

Share post:

Latest